
కొవిడ్ కాలంలో అమూల్య సేవలు, అంతర్జాతీయ సహకారం అందించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్టాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. బార్బడోస్లోని బ్రిడ్జిటౌన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని తరఫున భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గేలరిటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును గత ఏడాది నవంబర్ 20న గయానాలోని జార్ట్టౌన్లో జరిగిన రెండో ఇఒండియా–సీఏఆర్ఐకామ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా బార్బడోస్ ప్రధాని మైయా అమోర్ మోట్లీ ప్రకటించారు. ఈ పురస్కారంతో మోదీకి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు లభించిన అత్యున్నత పురస్కారాల సంఖ్య 20కి చేరుకున్నది.
మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డులు
నైజీరియా – ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్
గయానా – ఆనరరీ ఆర్డర్ ఆఫ్ఫ్రీడం ఆఫ్ బార్బడోస్
రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది ఆపోస్టల్
బార్బడోస్ – ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్
భూటాన్ – ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో
ఫ్రాన్స్ – గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్
ఈజిప్ట్ – ఆర్డర్ ఆఫ్ ది నైల్
పపువా న్యూగినియా – గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు
ఫిజీ – కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ
పలావు – ఎబాకాల్ అవార్డు
మాల్దీవులు – ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్– ఆర్డర్ ఆఫ్ జాయెద్
బహ్రెయిన్ – కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసన్స్
పాలస్తీనా – గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా
ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లఖాన్