
ప్రధాని మోదీకి శ్రీలకంలో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ’తో అక్కడి ప్రభుత్వం సత్కరించింది.ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రధాని మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణ పతకాన్ని అందుకున్న తర్వాత ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు. ఈ సత్కారానికి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేకు ప్రజలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.
థాయిలాండ్ పర్యటన అనంతరం శ్రీలంకలో పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ. ఇరుదేశాల మధ్య స్నేహం, సరస్పర సహకారం గురించి శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో చర్చించారు. రెండు దేశాల మత్స్యకారుల సమస్యలు, పరిష్కారం, ఖైదీలుగా ఉన్న మత్స్యకారుల విడుదల చేయాలని వారి పడవలను అప్పగించాలని ఇరు దేశాల మధ్య ఒప్పందంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గుజరాత్ లోని ఆరావళి పర్వతాల్లో లభించిన పురాతన సాంప్రదాయ వస్తువులను శ్రీలంకకు పంపిస్తున్నట్లు ప్రధానిమోదీ ప్రకటించారు.