ఆదిత్య ఎల్ 1 సక్సెస్తో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలను సక్సె స్ చేయడంలో ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనమన్నారు. ఈ అసాధారణ ఫీట్ ని దేశప్రజల తరపున ప్రశంసిస్తున్నానన్నారు మోదీ. మానవాళి ప్రయోజనాలకోసం భారత్ సైన్స్ కొత్త సరిహద్దులను సృష్టిస్తోందన్నారు.
ఆదిత్య ఎల్ 1 మిషన్ ఫుల్ సక్సెస్ అయింది. చరిత్రలో ఇస్రో మరో మైలురాయి దాటింది.శనివారం ( జనవరి 6) తన గమ్యస్థానమైన లెగ్రాంజ్ 1 ను ఆదిత్య ఎల్ 1 రీచ్ అయింది. సూర్యునిపై అధ్యయనం కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్ 1 వ్యోమనౌక గమ్యస్థానం చేరుకుంది. 1.5 మిలియన్ లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమనౌక లెగ్రాంజ్ 1 స్థానానికి చేరుకుంది. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం సేవలందించనుంది.
India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this…
— Narendra Modi (@narendramodi) January 6, 2024