Grammy Awards2024: శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ లకు గ్రామీ అవార్డ్స్

Grammy Awards2024: ప్రముఖ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహదేవన్ లకు గ్రామీ అవార్డు లభించింది. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో జాకీర్ హుస్సేన్,శంకర్ మహదేవన్ ల ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ ‘శక్తి’ గ్రామీ అవార్డును గెలుచుకుంది.

గ్రామీ అవార్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సంగీత పురస్కారం.శక్తి గ్రూప్ వ్యవస్థాపక సభ్యులలో గిటారిస్ట్ జాన్ మెక్ లాప్లిన్, జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, వయోలిన్ వాద్యకారుడు గణేష్ రాజగోపాలన్, పెర్కషనిస్ట్ సెల్వ గణేష్ వినాయక్ రామ్ ఉన్నారు.

అవార్డు గెలుచుకున్న విషయం తెలుపుతూ శంకర్ మహదేవన్ వీడియోను సోషల్ మీడియా షేర్ చేశారు. ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నందుకు వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 

గ్రామీ అవార్డులను నిర్వహించే రికార్డింగ్ అకాడమీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ xలో ప్రకటించింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విజేత శక్తికి అభినందనలు అని పోస్ట్ చేసింది. శంకర్ మహదేవన్ , రాజగోపాలన్ , సెల్వగణేష్ జాకీర్ హుస్సేన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.