థామస్ కప్‌‌లో భారత్‌‌కు స్వర్ణం.. మోడీ ట్వీట్

థామస్ కప్‌‌లో భారత్‌‌కు స్వర్ణం.. మోడీ ట్వీట్

థామస్ కప్ లో స్వర్ణం సాధించించిన భారత్ టీంను ప్రధాని మోదీ అభినందించారు. మొత్తం దేశం ఒప్పొగిందని తెలిపారు. భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఇండోనేషియాను 3-0తో ఓడించి థామస్ కప్ ను గెలుచుకుంది. థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో Impact Arenaలో జరిగిన థామస్ కప్ ఫైనల్ లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆదివారం చరిత్ర సృష్టించడంపై ప్రధాని నరేంద్ర మోదీ భారత టీంకు అభినందనలు తెలిపారు. నిష్ణాతులైన బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు, వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. వారు సాధించిన విజయం చాలా మంది క్రీడాకారులను ప్రేరేపిస్తోందన్నారు. 

లక్ష్యసేన్ తన మొదటి గేమ్ లో 8-21, 21-17, 21-16తో అంథోనీ గింటింగ్ ను ఓడించాడు. సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడి.. అహ్సన్, కెవిన్ లతో తలపడ్డారు. వీరు కూడా అద్భుతమైన ఆటతీరును కనబర్చారు. డబుల్స్ మ్యాచ్ ను 18-21, 23-21, 21-19తో గెలిచారు. అనంతరం ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టితో కిదాంబి శ్రీకాంత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 21-15, 23-21తో ఓడించాడు. దీంతో 14 సార్లు థామస్ కప్ కైవస్ చేసుకుంటూ వస్తున్న ఇండోనేషియాకు భారత్ బ్యాడ్మింటన్ షట్లర్లు చెక్ పెట్టారు. 

మరిన్ని వార్తల కోసం :

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్ 

థామస్ కప్ భారత్ కైవసం

రాజ్యసభ సీటు పై అనవసర ప్రచారం