జగన్ కు ప్రధాని మోడీ కంగ్రాట్స్

జగన్ కు ప్రధాని మోడీ కంగ్రాట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో YSRCP విజయం సాధించినందుకు ప్రధాని మోడీ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు గాను ట్విటర్ లో ట్వీట్ చేశారు. “ప్రియమైన జగన్.. మీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో గెలుపొందినందుకు మీకు అభినందనలు, మీ పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా” అంటూ మోడీ ట్వీట్ చేశారు.

ఆంధ్రాలో జగన్ విజయం కాయమవగా.. ఈనెల 30వ తేదీన జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఈ ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు YSRCP 40 స్థానాల్లో గెలిచి మరో 86 ప్లేస్ లలో ఆధిక్యంలో ఉంది. 25 MP సీట్లకు.. 23 లోక్ సభ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది జగన్ పార్టీ.