ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ మాట్లాడుతూ భారతదేశం "ప్రపంచంలో ప్రధాన సముద్ర శక్తిగా" ఎదుగుతోందని అలాగే విస్తరిస్తున్న ఓడల నిర్మాణ పరిశ్రమ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. అనంతరం మూడు ఫ్రంట్‌లైన్ నావికాదళ యుద్ధ నౌకలు, INS సూరత్, INS నీలగిరి మరియు INS వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేశారు.
ALSO READ | Naval Ships: సముద్ర రక్షణలో గ్లోబల్ లీడర్.. సైన్యంలోకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు
INS వాఘ్‌షీర్ ('హంటర్-కిల్లర్' సబ్‌మెరైన్), INS సూరత్ (గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్) మరియు INS నీలగిరి (స్టెల్త్ ఫ్రిగేట్) రాకతో భారత నావికాదళం మరింత బలపడింది. దీంతో పాకిస్థాన్, చైనా వంటి శత్రు దేశాల ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే బలం చేకూరింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత నావికాదళానికి కొత్త బలాన్ని ఇచ్చారని నేడు ఈ పవిత్ర భూమిలో 21వ శతాబ్దపు నౌకాదళాన్ని బలోపేతం చేయడానికి అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా విధ్వంసక నౌక, ఫ్రిగేట్ మరియు జలాంతర్గామి, ఈ మూడింటిని కలిపి కమీషన్ చేస్తున్నామని తెలిపారు.