PM Modi:థాయిలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ

PM Modi:థాయిలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా గురువారం (ఏప్రిల్3) ఉదయం బ్యాంకాక్ బయల్దేరి వెళ్లారు.  ఏప్రిల్ 4న బ్యాంకాక్ లో జరిగే BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. థాయిలాండ్‌లో కార్యక్రమాల తర్వాత ఆయన శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో తెలిపారు. 

పర్యటనకు ముందు ప్రధాని మోదీ BIMSTEC దేశాలతో భారతదేశం సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాబోయే మూడు రోజుల్లో భారతదేశం భాగస్వామ్యాలను పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి థాయిలాండ్ , శ్రీలంకలో వెళ్తున్నట్లు అని మోదీ Xలో పోస్ట్ చేశారు. 

థాయిలాండ్‌లో ద్వైపాక్షిక సమావేశాలు

బ్యాంకాక్ చేరుకున్న తర్వాత మోడీ థాయ్ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాతో సమావేశమై ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. థాయిలాండ్ రాజు మహా వజిరాలోంగ్‌కార్న్‌తో ఆయన సమావేశం కానున్నారు. 

ప్రధాని మోదీ థాయిలాండ్ లో పర్యటించడం ఇది మూడోసారి. 2018 తర్వాత మొదటిసారిగా స్వయంగా BIMSTEC శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుకుంటుంది. 
ప్రాస్పరస్, రీసైలెంట్, ఓపెన్ అనే థీమ్ తో 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, కనెక్టివిటీ,మానవ భద్రతను పెంపొందించడంపై ఈ సమావేశంలో సభ్య దేశాలు దృష్టి పెట్టనున్నాయి.