టీమిండియాకు ప్రధాని మోదీ ఫోన్.. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు

టీమిండియాకు ప్రధాని మోదీ ఫోన్.. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు

టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు, సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ప్రధాని మోదీ టీమిండియాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. టీం సభ్యులకు  విషెస్ చెప్పారు.   ఫైనల్ మ్యా్చ్ లో రాణించిన ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. 

అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును నడిపించిన రోహిత్ ను ప్రశంసించారు మోదీ.  76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని, లాస్ట్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పాండ్యా,అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ ను  అభినందించారు. పరుగులు కట్టడి చేసి టోర్నీలో 15 వికెట్లు తీసిన బుమ్రాను అభినందించారు. భారత్ విజయంతో ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్‌కు చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

 7 పరుగులతో సౌతాఫ్రికాను ఓడించిన భారత్ పొట్టి ఫార్మాట్ లో రెండోసారి వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి సారిగా 2007లో ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ సాధించగా 17 ఏళ్ల తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్ నెగ్గడం విశేషం.