ఢిల్లీ: దేశంలోని 65 లక్షల మందికి ఆస్తి కార్డు లను వర్చువల్ గా పంపిణీ చేశారు ప్రధాని మోదీ. ఈ పథకం కింద దేశంలోని 10 రాష్ట్రా లు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 230 జిల్లాల్లోని లబ్ధిదారులు కార్డులు అందుకున్నా రు. గ్రామీణ ప్రజలకు సాధికారికత కల్పించేం దుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
“ఈ రోజు చారిత్రా త్మకమైన రోజు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ఈ పథకం ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు. లబ్ధిదారులకు నా అభినందనలు. ఐదేళ్ల క్రితం కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇన్నేళ్లలో 1.5 కోట్ల మందికి స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేశాం. ఈ రోజు మరో 65 లక్షల కుటుంబాలు ఈ కార్డులను పొందాయి. దీంతో గ్రామాల్లోని 2.25 కోట్ల మంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డుల ను పొందారు' అని ప్రధాని తెలిపారు.