బీజేపీకి ప్రధాని మోదీ రూ.2000 విరాళం

  •    విరాళాలు అందించాలని పిలుపు

న్యూఢిల్లీ: బీజేపీకి ప్రతి ఒక్కరూ విరాళాలు అందించాలని ప్రధాని మోదీ కోరారు. తాను పార్టీ ఫండ్ కు రూ.2000 విరాళంగా ఇచ్చానని తెలిపారు.  ఆదివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘వికసిత్‌ భారత్ నిర్మాణం కోసం జరుగుతోన్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి బీజేపీకి విరాళం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. నమో యాప్‌ ద్వారా మీరు కూడా ఇందులో పాలుపంచుకోవాలని కోరుతున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు. 

పార్టీకి విరాళమిచ్చిన రసీదును కూడా ట్వీట్ కు జోడించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా మార్చి 1న రూ.1000 చెల్లించి ఈ డోనేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై ఇన్ కం ట్యాక్స్ చట్టంలోని 80జీజీబీ కింద కంపెనీలకు, 80జీజీసీ కింద ఇతరులకు మినహాయింపు లభిస్తుంది. సుప్రీంకోర్టు ఇటీవలే ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విరాళాలను నమో యాప్ ద్వారా స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది.