ఉత్తర్ ప్రదేశ్‌లో మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ. ఇప్పటికే ఐదు విడతల ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. అయితే ఈ సందర్భంగా యూపీలోని రాబర్ట్స్ గంజ్‌లో జరిగిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజల్ని తరలించడానికి తాము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఆపరేషన్ గంగా కింద ఇప్పటివరకు వేయి మంది పౌరులు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ మిషన్‌ను వేగవంతం చేయడానికి, భారతదేశం నలుగురు మంత్రుల్ని అక్కడికి పంపిందన్నారు మోడీ. భారతీయుల సురక్షితంగా తరలించేందుకు అనువైన ఏ మార్గాన్ని కూడా వదలిపెట్టలేదన్నారు. భారత్ బలం పెరుగుతున్న కారణంగానే.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన జాతీయుల్ని సురక్షితంగా తరలించగలుతున్నామన్నారు. దీని కోసం ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని నడుపుతున్నామన్నారు ప్రధాని.
We're making all efforts to evacuate people stuck in #Ukraine under Operation Ganga. 1000s of citizens brought back to India. To accelerate this mission, India has sent its 4 ministers there, will leave no stone unturned for the safe passage of Indians: PM Modi in Robertsganj, UP pic.twitter.com/PCYhMhUuEH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 2, 2022