ప్రధాని మోదీ రెండు రోజుల ధ్యానం ముగిసింది

ప్రధాని మోదీ రెండు రోజుల ధ్యానం ముగిసింది

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ రెండు రోజుల ధ్యానాన్ని శనివారం (జూన్1) ముగించారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ లో మే 30న ఈ ధ్యాన ముద్రలోకి వెళ్లారు. 45 గంటల అనంతరం శనివారం ఆయన ధ్యానాన్ని ముగించారు.  ధ్యాన మండపంలో స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని పగలు,రాత్రి ధ్యానం చేశారు. 

మే 30న తిరువనంతపురం నుండి హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని.. PM మోడీ భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేసి అనంతరం  ఫెర్రీ సర్వీస్ ద్వారా రాక్ మెమోరియల్‌కు చేరుకుని ధ్యానం ప్రారంభించారు.1892 చివరిలో సముద్రం లోపల రాళ్లపై ధ్యానం చేసిన స్వామి వివేకానందకు నివాళిగా నిర్మించిన స్మారక చిహ్నం, స్మారక చిహ్నం వద్ద ప్రధాని బస చేయడం ఇదే మొదటిసారి.