కువైట్‌లో అగ్నిప్రమాదం.. మోదీ సంతాపం

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, బాధితులను పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బాధితులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పని చేస్తోంది అని మోదీ ట్వీట్ చేశారు.  

కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా భారీ అగ్నిప్రమాదం సంభవించిన భవనాన్ని సందర్శించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఒక ప్రకటనలో, ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  విషాద అగ్ని ప్రమాదంలో మరణించిన లేదా గాయపడిన వారికి పూర్తి సహాయానికి హామీ ఇచ్చారు.

కువైట్‌లో  బుధవారం జరిగిన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో 41 మంది సజీవదహనం అయ్యారు. ఇందులో  పలువురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. మరో 15 మంది గాయపడ్డారు.  కువైట్‌లోని దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లోని మంగాఫ్ నగరంలో తెల్లవారుజామున 4 గంటలకు భవనంలో మంటలు చెలరేగాయి.