ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (జూన్ 5) 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిత్యనాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యోగి ‘డైనమిక్ సీఎం’అని ప్రధాని కీర్తించారు. ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ జీ జన్మదిన శుభాకాంక్షలు.. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది.రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రజానుకూల పాలన అందిస్తున్నారు.ప్రజాసేవలో ఆయన దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని తెలపారు. అలాగే యోగీ బర్త్ డే సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,పలువురు కేంద్ర మంత్రులు విషెస్ అందించారు.
Birthday greetings to UP’s dynamic Chief Minister @myogiadityanath Ji. Under his able leadership, the state has scaled new heights of progress. He has ensured pro-people governance to the people of the state. Praying for his long and healthy life in service of the people.
— Narendra Modi (@narendramodi) June 5, 2022