వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ( మే 14) వారణాసిలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, చంద్రబాబు నాయుడు, జితన్ రామ్ మాంఝీ, ఓంప్రకాష్ రాజ్‌భర్, సంజయ్ నిషాద్, ఎన్‌డిఎ కూటమికి చెందిన రాందాస్ అథవాలే వారణాసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

అంతకు ముందు ఆయన బాబా కాల భైరవుడికి ప్రార్థనలు చేశారు. తర్వాత గంగానది దశాశ్వమేధ ఘాట్‌ పూజలు చేసి, గంగా ఆరతి ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా వారణాసి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి నుంచి లోక్ సభ ఎంపీ మోదీ పోటీ చేయడం ఇది మూడో సారి. 2024 లోక్ సభ ఎలక్షన్ లో జూన్ 1న ఇక్కడ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వస్తాయి.