ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

సబ్ కాసాత్..సబ్ కా వికాస్ దేశమంతా విస్తరించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జార్ఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించారు.ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ నుంచి పాట్నా, బ్రహ్మపూర్ నుంచి టాటాగర్, రూర్కెలా నుంచి హైరా, డియోఘర్ నుంచి వారాణాసి మధ్య నడవనున్నాయి. 

ఇటు 660 కోట్లతో నిర్మించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. రైళ్ల విస్తరణతో తూర్పు భారతదేశం మరింత అభివృద్ధవుతుందన్నారు మోదీ. గతంతో పోల్చితే జార్ఖండ్ కు రైల్వే బడ్జెట్ 16 రెట్లు పెరిగిందన్నారు. ఆదివాసీ, దళితులు మనదేశానికి ముఖచిత్రాలన్నారు. రైల్వే అనుసంధానం నెట్ వర్క్ లో 100శాతం విద్యుదీకరణ ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ కూడా ఉందన్నారు. 50కిపైగా రైల్వే స్టేషన్లు పునరుద్ధరించబడుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతుందన్నారు మోదీ.