ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమ్మిట్‌కు నరేంద్ర మోదీ హాజరుకావాలని పాకిస్తాన్ ఇన్వైట్ చేసింది. SCO సమావేశానికి ఇస్లామాబాద్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అక్టోబరు 15-, 16 తేదీలలో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
భారత్, పాకిస్తాన్, రష్యా, చైనా దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పూర్తి సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ ఆసియా ఖండ దేశాల సహాకారం, అభివృద్ధికి దోహదపడుతుంది. మోదీ SCO సమావేశానికి పాకిస్తాన్ వెళ్తారా లేదా వర్చువల్ గా హాజరైవుతారని అనేది తెలియాలి. ఇండియా ప్రతినిధిగా ఓ కేంద్ర మంత్రిని లేదా వ్యక్తి నియమించి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి పంపవచ్చు. గతంలో పాకిస్తాన్ నిర్వహించిన SCO సమావేశాలకు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించడానికి న్యూఢిల్లీ ఒక మంత్రిని పంపింది.
గత రెండు నెలల్లో జమ్మూ ప్రాంతంలో వరుస దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇస్లామాబాద్ పర్యటన కూడా అసంభవం. ఇంతకుముందు, ఈ ప్రాంతం ఉగ్రవాద రహితంగా పరిగణించబడింది, అయితే, ఇటీవల పాకిస్తాన్ చేసిన దాడులతో ఈ ప్రాంతంలో మళ్లీ అనిశ్చితి ఏర్పడింది.