దశాబ్దాల ఓబీసీ కోటా కలను నిజం చేశాం: ప్రధాని మోదీ

దశాబ్దాల ఓబీసీ కోటా కలను నిజం చేశాం: ప్రధాని మోదీ

ఓబీసీ(OBC) కోటాకు రాజ్యాంగ హోదా కల్పించిందే బీజేపీ ప్రభుత్వమని ప్రధాని మోదీ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 6) రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దశాబ్దాల ఓబీసీ కోటా కలను నిజం చేశామన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలను అభివృద్ధి చేశామన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి మిషన్ మోడ్ లో పనిచేస్తున్నామని, బీజేపీ పదేళ్ల పాలనలో నారీశక్తి ప్రతిబింబించిందన్నారు ప్రధాని మోదీ. 

నేషన్ ఫస్ట్ నినాదంతో ముందుకెళుతున్నాం..అదే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఫస్ట్ స్లోగన్ ఇస్తుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ది నమూనాను ప్రజలు స్వాగ తిస్తున్నారు.. ప్రజలు నమ్మారు కాబట్టే మూడు సార్లు అధికారం ఇచ్చారని ప్రధాని అన్నారు.  కాంగ్రెస్ ఎప్పుడూ ఓట్లకోసమే పనిచేస్తుంది.. అందుకే కాంగ్రెస్ ఫ్యామిలీ పాలిటిక్స్ ను, తప్పుడు ప్రకటనలు జనం నమ్మడం లేదని చెప్పారు.  

ALSO READ | Chandrayaan 4: 2027లో చంద్రయాన్ -4 ప్రయోగం

విభజించి పాలించడమే కాంగ్రెస్ విధానమన్నారు ప్రధాని మోదీ.. అయితే దేశాభివృద్ది కోసం అందరిని కలుపుకుపోవడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందన్నారు. సబ్ కా సాత్  సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నా రు ప్రధాని మోదీ.