తన ఆహార ఖర్చులను ప్రధాని మోడీ స్వయంగా భరిస్తున్నాడని పీఎం ఆఫీస్ ప్రకటించింది. ప్రభుత్వ బడ్జెట్ నుంచి మోడీ భోజనానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు పీఎంవో సెక్రటరీ బినోద్ బీహారీ సింగ్ సమాధానమిచ్చారు. ప్రధాని నివాసాన్ని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రక్షిస్తోందని.. అయితే వాహనాల బాధ్యతను ఎస్పీజీ చూసుకుంటుందని తెలిపారు.
కాగా పార్లమెంట్లో క్యాంటీన్ కు సంబంధించి ప్రభుత్వం పలు సంస్కరణలను చేపట్టింది. క్యాంటీన్ లో ఎంపీలకు ఇచ్చే సబ్సీడీని జనవరి 19, 2021న స్పీకర్ ఓం బిర్లా రద్దు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా 9 కోట్ల వరకు ఆదా అవుతోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 2015 మార్చి 2న బడ్జెట్ సెషన్ సందర్భంగా పార్లమెంట్ క్యాంటీన్ లో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.