సీనియర్ మంత్రులతో మోడీ కీలక భేటీ

సీనియర్ మంత్రులతో మోడీ కీలక భేటీ

దేశంలోని రాజకీయ పరిస్థితులపై సీనియర్ మంత్రులతో చర్చించారు ప్రధాని మోడీ. ప్రధాని నివాసంలో వరుస సమావేశాలు జరిగాయి. మొదట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు మోడీ. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య-రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లతోనూ మాట్లాడారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. మొత్తంగా 5 మీటింగ్ లు జరిగాయి. మంత్రులు సభ్యులుగా ఉన్న వివిధ గ్రూప్ ల పనితీరుపై మోడీ సమీక్షించినట్టు సమాచారం. త్వరలోనే కేబినెట్ విస్తరణ, ఈ నెల 24న జమ్మూకశ్మీర్ కు సంబంధించిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే ఆ మీటింగ్ లో జమ్మూకశ్మీర్ లో నియోజకవర్గాల డీలిమిటేషన్ పై మాత్రమే చర్చ జరుగుతుందని... పూర్తి స్థాయి రాష్ట్ర హోదాపై కాదని ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.