ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనకాపల్లిలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ ... బీజేపీ మంత్రం అభివృద్ది అయితే.. వైఎస్సార్ మంత్రం అవినీతి అని ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి వైఎస్సార్ ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంటే.. వైఎస్సార్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ప్రధాని అన్నారు. విశాఖ పట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ ను ఆమోదించినా.. రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వడం లేదన్నారు. ఏపీలో అవినీతి తప్ప ఏమీ వినపడటం లేదన్నారు.
ఏపీలో పీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతున్నాయని పేర్కొన్నారు. ఈ దోపిడీ నుంచి విముక్తి కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కాంగ్రెస్, వైసీపీల వల్ల విఘాతం కలిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తిరస్కరిస్తే.. ఆంధ్రాలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాను.. ఏపీ సంస్కృతిని కాపాడే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులకు మీరు వేసే ఓట్లు మోడీని బలపరుస్తుందని తెలిపారు.ఉత్తరాంధ్ర సృజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇస్తున్నాను.. ఇథనాల్ ప్లాంట్ నిర్మాణాలు చేపడతామన్నారు. మరోవైపు.. అనకాపల్లి ప్రాంతంలో చెరకు రైతులు ఆందోళనలో ఉన్నారని.. ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు.
కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్అభివృద్ది కోసం పనిచేస్తుందన్నారు. కర్నూలు లో త్రిపుల్ ఐటీ, తిరుపతిలో ఐఐటీ, ఐఏఎస్ఆర్లాంటి సంస్థలు స్థాపించామన్నారు. అలాగే విశాఖపట్నంలో ఐఏఎం కూడా ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా యువకుల కోసం పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించామని అనకాపల్లి సభలో ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెరిగి.. ఫార్మా రంగాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లుసాయం అందించామన్నారు. పూడిమకలో గ్రీన్ ఎనర్జీ పార్క్, నెక్కపల్లిలో మరో పార్క్ ను ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించామన్నారు.
ఏపీలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. బీజేపీ హయాంలో భారత్ ఖ్యాతి పెరిగిందన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి త్రిపుల్ ఐటీ, ఐఐటీ ఇచ్చామన్నారు. అనకాపల్లి నుంచి అనంతపురం వరకు 6 లైన్ల జాతీయరహదారిని నిర్మించామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే రాయ్ పూర్ నుంచి విశాఖ పట్నం వరకు ఎక్స్ప్రెస్ నిర్మాణంలో ఉందన్నారు. కోల్ కత్తా టూ చెన్నై హైవే ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుందన్నారు. 2014 వరకు 4 వేల కిలో మీటర్లు జాతీయ రహదారి ఉంటే ఇప్పుడు ... ఏపీలో 9 వేల కిలో మీటర్లు హైవేలు నిర్మిస్తున్నామన్నారు.
అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్.. అభివృద్ది చెందిన భారత్ అనే విశ్వాసంపై జరుగుతున్న మొదటి ఎన్నికలు జరుగుతున్నాయన్నన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు. వికసిత్ ఏపీ.. వికసిత్ భారత్ స్థాపన కోసం ఎన్డీఏకు ఓటెయ్యాలని ప్రధాని మోది అన్నారు. బీజేపీ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం గౌరవం పెరిగిందన్నారు. విదేశాల్లో ఉండే ఏపీ ప్రజలకు, భారతీయులకు గుర్తింపు వచ్చిందన్నారు. నాపని చూసి దేశ ప్రజలు ఓటేస్తున్నారన్నారని ప్రధాని మోదీ అన్నారు.