ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లోని నసావు కొలీజియంలో 'ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ' (Indo-American Community of USA) ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్నమ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
అయితే, ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ వేదికపై దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) 'పుష్ప-1' మూవీలోని శ్రీవల్లి పాటతో ఆడియన్స్ ను ఊర్రూతలూగించారు.
అలాగే దేవిశ్రీ 'హర్ ఘర్ తిరంగా' పాట పాడుతున్న సమయంలో పీఎం మోదీ వేదికపైకి చేరుకోవడంతో..దాంతో ఒక్కసారిగా ఆ ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఇక నమస్తే ఇండియా అంటూ ప్రవాసులను పలకరించిన డీఎస్‌పీ.. ప్రధాని సమక్షంలోని తన పాటను కొనసాగించారు.
Also Read : ప్రతి ఇండియన్‌కు నచ్చేలా
అనంతరం దేవిశ్రీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాధ్వి, ఇతర కళాకారులను మోదీ అభినందించారు. అయితే, మన తెలుగు సంగీత సంచలనం అయిన డీఎస్పీని ఆప్యాయంగా గుండెలకు పీఎం మోదీ హత్తుకోవడంతో పాటు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మ్యూజిక్ ప్రియులతో పాటు సినీ ప్రముఖులు డీస్పీకి విషెష్ చెబుతున్నారు.
Indian PM Modi with Hanumankind, Aditya Gadhvi and Devi Sriprasad at diaspora event in New York https://t.co/FPvUizBb7D pic.twitter.com/ysz9bxITGP
— Sidhant Sibal (@sidhant) September 22, 2024
కేరళకు చెందిన హిప్-హాప్ కళాకారుడు హనుమాన్‌కైండ్, అతని నుంచి వైరల్ అయిన పాట 'బిగ్ డాగ్స్' గత నెలలో బిల్‌బోర్డ్ గ్లోబల్ 2002లో టాప్ 10 చార్ట్‌లలోకి ప్రవేశించింది. అలాగే తన నటనతో ప్రేక్షకులను థ్రిల్ చేసింది.ఇక ఈ వేదికపై హనుమాన్‌కైండ్ ప్రధాని మోదీ ముందు 'బిగ్ డాగ్స్' ప్రదర్శించారు. దీంతో ప్రేక్షకులు ఆయనను ఉత్సాహపరిచారు.