గత ఎనిమిదేళ్ళలో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకెళ్ళామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దసరా రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో ఎయిమ్స్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 3,650 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. గ్రీన్ ఎయిమ్స్ గా దీన్ని తీర్చిదిద్దుతామనీ... హిమాచల్ ప్రదేశ్ ను మెడికల్ టూరిజంకు అడ్డాగా మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి మర్చిపోయాయని..తమ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలో,రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం వల్లే హిమాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం కులులో జరిగిన దసరా వేడుకలు అంబరాన్ని అంటాయి. అక్కడ నిర్వహించిన దసరా రథయాత్రలో ప్రధానిమోడీ పాల్గొన్నారు. శ్రీ భగవాన్ రఘునాథ్ జీ రథాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.