సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు మొట్టమొదటి సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఇది భూభాగంలోని ఫైబర్ కేబుల్ కు సమానంగా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. చెన్నై- అండమాన్ నికోబార్ దీవులను అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ కు మోడీ 2018, డిసెంబర్ 30న శంఖుస్థాపన చేశారు. చెన్నై- అండమాన్ నికోబార్ దీవుల మధ్య దూరం 2,312 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా.. కచ్చితమైన నెట్ సేవలు ఈ ప్రాజెక్ట్ ద్వారా అక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు అక్కడి నుంచి నుండి లిటిల్ అండమాన్ మరియు పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీప్ వరకు ఈ రోజు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో అక్కడ టూరిజం కూడా బాగా పెరుగుతుంది. ఓఎఫ్‌సీతో నికోబార్ ప్ర‌జ‌ల‌కు మొబైల్ క‌నెక్టివిటి‌, వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ ల‌భిస్తుంది. అండ‌మాన్ ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ ఇండియా లాభాలు అందుతాయి. టూరిజం, బ్యాంకింగ్‌, షాపింగ్‌, టెలిమెడిసిన్ లాంటి వ‌స‌తులతో పాటు ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వస్తుంది. రూ. 1224 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేసిన బీఎస్ఎన్ఎల్, టీసీఐఎల్ కంపెనీలకు ధన్యవాదాలు’ అని మోడీ అన్నారు.

For More News..

తెలంగాణలో మరో 1256 కరోనా కేసులు

కేరళ విమాన ప్రమాదం తర్వాత మళ్లీ మొదలైన వందే భార‌త్ మిష‌న్