ప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఢిల్లీ బుద్ధ జయంతి పార్కులో.. మొక్కలు నాటిన ప్రధాని మోదీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఢిల్లీ బుద్ధ జయంతి పార్కులో.. మొక్కలు నాటిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో మొక్కలు నాటడం ద్వారా ఏక్ పేడ్ మా కే నామ్(అమ్మ పేరుతో ఒక్క చెట్టు ) నినాదంతో మొక్కపెంపకంపై ప్రచారాన్ని  ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటనున్నారు. ప్రధాని మోదీ తోపాటు కేంద్ర మంత్రి భూపేందర్  యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇవాళ( జూన్ 5, 2024) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా , 1972 స్టాక్ హోం కాన్ఫరెన్స్ ప్రారంభం జ్ణాపకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘‘భూపునరుద్దరణ, ఎడారీకరణ , కరువు నివారణ’’థీమ్ తో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.