ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్ కంపెనీలు భారత్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి కేంద్ర కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు. ‘గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి వందేళ్లలో ఎన్నడూ లేని మహమ్మారితో ప్రపంచం పోరాడుతోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను భారత్ తయారు చేసింది. 12 ఏండ్లు పైబడిన ఎవరికైనా సరే దీనిని వేయొచ్చు’ అని ప్రధాని మోడీ అన్నారు. అలాగే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ కూడా అభివద్ధి చేస్తున్నామని, ఇది ఫైనల్ స్టేజ్‌లో ఉందని ఆయన తెలిపారు. కరోనాపై పోరాడేందుకు భారత సైంటిస్టులు ఒక నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌ను కూడా డెవలప్ చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాక్సిన్ కంపెనీలూ భారత్‌లో తమ తయారీ యూనిట్స్ పెట్టి ఉత్పత్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
I would like to inform the UNGA that India has developed the world's first DNA vaccine. This can be administered to anyone above the age of 12. An mRNA vaccine is in the final stages of development. Indian scientists are also developing a nasal vaccine against COVID19: PM Modi pic.twitter.com/OaP4voUdGy
— ANI (@ANI) September 25, 2021
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా వికేంద్రీకరణ జరగాల్సి ఉందని కరోనా మహమ్మారి మనకు నేర్పిందని మోడీ అన్నారు. అందుకే గ్లోబల్ వ్యాల్యూ చెయిన్స్ విస్తరించాలని, ఈ అంశం ఆధారంగానే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ రూపుదిద్దుకొందని చెప్పారు. ‘‘భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుంది.. భారత్ సంస్కరణలు (రిఫామ్స్) తెస్తే.. ప్రపంచంలో మార్పు (ట్రాన్స్‌ఫామ్స్) వస్తుంది” అని మోడీ అన్నారు.
మరిన్ని వార్తల కోసం..
మరిన్ని వార్తల కోసం..
పాక్.. తక్షణం మా భూభాగాలను విడిచి వెనక్కి పో
ప్రజల మంచి కోసం తాలిబాన్లకు అండగా నిలుద్దాం: ఇమ్రాన్
పాకిస్థాన్‌కు కొట్టినట్టుగా జవాబు.. ఎవరీ స్నేహా దూబే?