న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం (జూలై6) బ్రిటన్ ప్రధానితో మోదీ ఫోన్ లో మాట్లాడారు. భారత్, యూకె మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలను సాగించేందుకు కృషి చేయనన్నట్లు తెలిపారు. కొత్త ప్రధాని స్టార్మర్ ఇండియాల్లో పర్యటించాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు స్టార్మర్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియా, యూకె మధ్య వాణిజ్య , స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించేందుకు ఇరువురు ప్రధానులు ఏకాభ్రియాయానికి వచ్చినట్లు తెలుస్తోంద. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు ఇరువులు నేతలు అంకిత భావంతో ఉన్నట్లు చెప్పారు. యూకె సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిపై భారతీయ సమాజం సాను కూల ప్రభావం వంటి అంశాలపై వారు మాట్లాడారు. ఇరుదేశాల ప్రజలు, వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించడం కొనసాగించాలని నిర్ణయించారు.
ఇరువురు నాయకులు భారతదేశం మరియు UK మధ్య చారిత్రాత్మక సంబంధాలను ప్రతిబింబించారు మరియు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ధృవీకరించారు. పరస్పర ప్రయోజనకరమైన భారతదేశం-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసేందుకు కృషి చేస్తామన్నారు.