హిమాలయాలకు వెళ్తున్నారా..పవన్ కళ్యాణ్పై ప్రధాని మోదీ జోకులు

హిమాలయాలకు వెళ్తున్నారా..పవన్ కళ్యాణ్పై ప్రధాని మోదీ జోకులు

ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణస్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. వేదికపై ఎన్డీయే కూటమి నేతలను వరసగా పలకరిస్తూ వచ్చిన ప్రధాని మోదీ..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దగ్గరకు వచ్చి కాసేపు ముచ్చటించారు. పవన్ వేషధారణ చూసి ప్రధాని జోకులు వేశారు. దీంతో వేదికపై నవ్వులు విరబూశాయి. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ ను మీడియా ప్రశ్నించగా.. చిట్చాట్లో తన అనుభవాన్ని పంచుకున్నారు. 

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ ను వేదికపైకి వచ్చే సమయంలో పలకరించారు. ప్రత్యేక వేషధారణలో ఉన్న పవన్ ను చూసి కొద్దిసేపు ముచ్చటించారు..ఇదే విషయాన్ని పవన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రధాని  నాపై జోకులు వేస్తుంటారు.. ఈ రోజు కూడా నా వేషధారణ చూసిన తర్వాత అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నావా ప్రధాని అన్నారని’’ పవన్ చెప్పారు.‘‘అలాంటిదేమీ లేదు..నేను చేయాల్సింది చాలా ఉందని’’ చెప్పాన న్నారు. 

ALSO READ | ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

ఇక ఏపీలో రాజకీయాలకు గురించి ప్రశ్నించగా..కూటమిలో సమన్వయంతో ముందుకు సాగుతున్నాం..వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేదు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందన్నారు పవన్. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారు. ఆకారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తు తున్నా యి. ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. పర్యావరణ శాఖ...నాకు ఇష్టమైన శాఖ..నిబద్ధతలో నా మంత్రిత్వ శాఖ బాధ్య తలు నెరవేరుస్తున్నామన్నారు.