డెభ్బై ఏళ్లు పైబడిని వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ధన్వంతరి జయంతి సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. PM మోడీ లబ్ధిదారులకు ఆయుష్మాన్ వయ వందన కార్డును అందజేశారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించినట్లు సెప్టెంబర్ లో ప్రకటించారు.
ALSO READ | మోదీ చెప్పినా వినట్లే..! 67 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి 14 లక్షలు దోచేశారు
సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు కంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల అందరికీ హెల్తీ సెక్యూరిటీని ఇవ్వడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY)ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వారు ప్రతి సంవత్సరం వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవడానికి రూ.5లక్షల కవరేజీ వర్తిస్తోంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hands over Ayushman Vaya Vandana Card to the beneficiaries pic.twitter.com/hWdrtCD0G4
— ANI (@ANI) October 29, 2024
న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ స్మీమ్ లో ఎందుకు చేరలేదని ప్రధాని ప్రశ్శించారు. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని వృద్ధులను ప్రధాని క్షమాపణలు కోరారు. తాను దేశ ప్రజలకు సేవ చేయగలనని, కానీ.. రాజకీయ అడ్డుకట్టల కారణంగా ఇక్కడి ప్రజలకు నేను సేవ చేయలేకపోతున్నా అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయూష్మాన్ భారత్ పథకంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు చేరలేదు.. అందుకే మోదీ ఇలా అన్నారు.