మారిషస్ లో భారత్ సహాయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోడీ. సోషల్ హౌసింగ్ యూనిట్స్ ప్రాజెక్టు, సివిల్ సర్వీస్ కాలేజీ, 8 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్ట్ ను రిమోట్ ద్వారా లాంఛ్ చేశారు. 2015లో మారిషస్ లో పర్యటించినప్పుడు ప్రాంతీయ అభివృద్ధి, భద్రత గురించి వివరించానన్నారు మోడీ. మారిషస్ కు భవిష్యత్ లోను సహకారం అందిస్తామని చెప్పారు. మెట్రో రైలు ఎక్స్ టెన్షన్ కు సహాయం చేస్తామని తెలిపారు. సముద్ర భద్రతలో దైపాక్షిక సహకారం కార్యరూపం దాల్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
Upon his passing, we had declared a day of national mourning in India, and our Parliament had also paid homage to him.
— PMO India (@PMOIndia) January 20, 2022
It was our privilege to honour him with the Padma Vibhushan award in 2020: PM @narendramodi
మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్ తో కలిసి ఈ ప్రారంభోత్సవాలను చేశారు మోడీ. ఈ సందర్భంగా ఆ దేశ దివంగత మాజీ ప్రధాని అనిరుద్ జుగ్నౌత్ మారిషస్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో చేసిన కృషిని మోడీ గుర్తు చేసుకున్నారు. భారత్ పై ఎంతో గౌరవం కలిగిన ఆయన ఒక విజన్ తో పని చేశారని అన్నారు. ఆయన మరణించిన సమయంలో భారత్ ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని పాటించిందని, పార్లమెంట్ కూడా సంతాపం తెలిపిందని చెప్పారు. అలాగే 2020లో ఆయన గౌరవార్థం భారత్ పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.