విశ్వకర్మ జయంతి..తన పుట్టినరోజు సందర్భంగా సాంప్రదాయ కళాకారుల కోసం ఆదివారం (సెప్టెంబర్ 17న) పీఎం విశ్వకర్మ స్కీంను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ పథకం కింద మొత్తం 18 రకాల సంప్రదాయ చేతి వృత్తుల పరివారలకు లబ్ధిచేకూరనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కోసం రూ. 13వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
విశ్వకర్మ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షల వరకు లోన్ ఇస్తుంది. మొదట రూ. 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీసుకున్న లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత విశ్వ కర్మ భాగస్వాములకు అదనంగా రూ.2లక్షల లోన్ అందజేస్తారు.
ఎలా అప్లయ్ చేయాలి
#WATCH | Prime Minister Narendra Modi says "Under the PM Vishwakarma scheme, the government will provide up to Rs 3 lakhs loan without any (bank) guarantee. It has also been ensured that the interest rate is also very low. Govt has decided that Rs 1 lakh loan will be given in the… pic.twitter.com/eyfG6pvA6k
— ANI (@ANI) September 17, 2023
- ఈ పథకం కింద లబ్ధిదారులు బయోమెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్ ను ఉపయోగించి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
- ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతివృత్తుల వారికి వర్తిస్తుంది.
- మొదట 18 సాంప్రదాయ చేతివృత్తిదారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. వీరిలో వడ్రంగి(సుతార్), పదవ తయారీదారు, కవచం, కమ్మరి, సుత్తి, టూల్ కిట్ మేకర్, తాళాలు తయారు చేసేవాడు, స్వర్ణకారుడు, కుమ్మరి, శిల్పి, రాతిని విరిచేవాడు, చెప్పులు కుట్టేవాడు, తాపీపని, బుట్ట, చాప, చీపు మేకర్, బొమ్మల తయారీదారులు, ఫిషంగ్ నెట్ మేకర్, మంగలి, దండలుచేసేవాడు, టైలర్, చాకలి వంటి చేతివృత్తిదారులు ఈస్కీం కు అర్హులు.
- మొదటి ఏడాది ఐదు లక్షల కుటుంబాలకు బీమా, ఫైనాన్షియల్ ఇర్ 2023 నుంచి 28 వరకు ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు బీమా వర్తిస్తుంది.
- హస్తకళాకారులు, హస్తకళాకారుల ఉత్పత్తులు, సేవల నాణ్యతను మెరుగుపరచడం , వారు దేశీయ , గ్లోబల్ వాల్యూ చైన్‌లతో అనుసంధానించబడి ఉండేలా చూడడం ఈ పథకం ప్రధాన దృష్టి.
- లబ్ధిదారులకు PM విశ్వకర్మ సర్టిఫికేట్, ID కార్డ్ ఇస్తారు. ప్రాథమిక, అధునాతన శిక్షణతో కూడిన నైపుణ్యం అప్‌గ్రేడేషన్ అందించబడుతుంది.
- ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు ₹ 15,000 టూల్‌కిట్ ప్రోత్సాహకం, ₹ 1 లక్ష వరకు (మొదటి విడత), ₹ 2 లక్షలు (రెండో విడత) రాయితీ వడ్డీ రేటుతో ₹ 15,000, ప్రోత్సాహకం అందించబడుతుంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi launched 18 post tickets and the Toolkit Booklet during the launch of 'PM Vishwakarma' scheme at the India International Convention and Expo Centre, in Dwarka. pic.twitter.com/INpuygea2Y
— ANI (@ANI) September 17, 2023