కుంభమేళా నీళ్లను మారిషన్​ తీసుకెళ్లాను.. ప్రధాని మోది

 కుంభమేళా నీళ్లను మారిషన్​ తీసుకెళ్లాను.. ప్రధాని మోది

మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని ప్రధాని మోది  మంగళవారం ( మార్చి 18)న లోక్​ సభలో తెలిపారు. బాలరాముని ప్రతిష్ఠ జరిగిన ఏడాదికే ఉత్తరప్రదేశ్​ లో మహాకుంభమేళా  జరిగిందన్న ప్రధాని .. దేశ ఐక్యతను కుంభమేళా ద్వారా ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. మహా కుంభ మేళా చారిత్ర ఘట్టమని.. తాను మారిషన్​ వెళ్లినప్పుడు కుంభమేళా నీళ్లను తీసుకెళ్లానన్నానని తెలిపారు.

కుంభమేళాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు  ఆవిష్కృతమయ్యాయని.. ఇది దేశ ప్రజల విజయమని లోక్​ సభలో ప్రధాని మోదీ తెలిపారు,  ప్రయాగ్​ రాజ్​ లో 66 కోట్ల మంది స్నానాలు చేశారని.. కుంభ మేళా విజయంతంతం కావడానికి అందరూ సహకరించారన్నారు,  ఇది భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలుస్తుందని.... కుంభమేళాలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.