సేంద్రీయ సాగుపై రైతుల్లో స్పూర్తి నింపిన ‘మన్ కీ బాత్ ’

 మన కీ బాత్ ప్రధాని మోడీ ప్రతి ఆదివారం  సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడుతారు. ఆయా రంగాల్లో రాణించిన వారిని అభినందించడమే గాకుండా  వారి చెప్పిన సూచనలను, సలహాలను  వింటారు. అయితే ప్రధాని మోడీ మన్ కీ బాత్ వ్యవసాయం రంగంపై కీలక ప్రభావం చూపింది.  వ్యవసాయంలో వస్తున్న టెక్నాలజీ, ఆవిష్కరణలపై రైతాంగానికి మన్ కీ బాత్ చాలా ఉపయోగపడిందనడంలో  సందేహం లేదు.

2014 అక్టోబర్ 3   నుండి అధికారికంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు 99 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. ఏప్రిల్ 30న ఆదివారం 100 వ ఎపిసోడ్  ప్రసారం అవుతుంది.   అయితే ఈ  మొత్తం మన్ కీ బాత్ లో 22 ఎపిసోడ్లలో   వ్యవసాయము దాని  అనుబంధ రంగాలకు సంబంధించిన విషయాలను వ్యవసాయదారులను ఉద్దేశించి నూతన ఆవిష్కరణల గురించి ప్రధాని  ప్రసంగించారు. 29 నవంబర్ 2015,  25 డిసెంబర్ 2022లో ప్రసారమైన 14వ, 96వ ప్రసార కార్యక్రములలో, సేంద్రీయ/సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతపై ప్రాధాన్యత ఇవ్వబడింది. వాస్తవానికి, ప్రస్తుత వ్యవసాయం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి, వ్యవసాయాన్ని మరింత సుస్థిర పరచడానికి స్వావలంబనగా మార్చడానికి భారత ప్రభుత్వం సేంద్రీయ/సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దీని దృష్ట్యా, వ్యవసాయ,   రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా సేంద్రీయ/సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య నిర్వహణ సంస్థని (మేనేజ్) నోడల్ సంస్థ,  జ్ఞాన భాండాగారంగా (నాలెడ్జ్ రిపోజిటరీగా) నియమించబడింది. 

మన్ కి బాత్ లో  ప్రధాని మోడీ  ప్రస్తావించిన సేంద్రియ/సహజ వ్యవసాయ అంశాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు 28 రాష్ట్రాలలో, 171 జిల్లాలలో, 171 కృషి విజ్ఞాన కేంద్రాలలో, భారతీయ జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) సహకారంతో 1398 మంది రైతులు, 1003 మంది వినియోగదారులను సంప్రదించి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రసారమైన సేంద్రియ/సహజ వ్యవసాయ పద్దతులను ప్రోత్సాహించేందుకు, అవగాహన కల్పించుటకు, అనుసరించుటకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా, ప్రభావంతంగా ఉందని కనుగొనటం జరిగిందని రైతులు తమ అభిప్రాయాలు చెప్పారు.  మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రసారమైన సేంద్రీయ/సహజ వ్యవసాయం అంశాలను విన్న రైతాంగంలో 92 శాతం మంది సేంద్రీయ/సహజ వ్యవసాయం చేయడానికి ఆసక్తి కనబరిచారు. 82 శాతం మంది రైతులు వారి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం లేదా అనుబంధ శాఖలను  సంప్రదించడం జరిగింది. 78 శాతం మంది వారు నేర్చుకొన్న విషయాలను తోటి రైతులతో పంచుకోవడానికి, ప్రదాని మోడీ  తదుపరి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి కనబరిచారు. 

మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా  సుమారు 74 శాతం మంది రైతులకు వ్యవసాయం,  ఇతర అనుబంధ శాఖలనుండి వారికి అవసరమైన సేంద్రీయ/సహజ వ్యవసాయం సంబంధించిన సహాయ సహకారాలు,  సాంకేతిక పరిజ్ఞానం పొందారు. సుమారు 60 శాతం మంది రైతులు సేంద్రీయ/సహజ వ్యవసాయం చేయడంతో సంతృప్తి చెందారు. అలాగే 88  శాతం మంది వినియోగదారుల సేంద్రీయ/సహజ వ్యవసాయం పై అవగాహన పెరిగింది. 63 శాతం మంది సేంద్రీయ/సహజ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. అభిప్రాయ సేకరణలో 56 శాతం మంది వినియోగదారులు సేంద్రీయ/సహజ వ్యవసాయ ఉత్పత్తులు సాధారణ ఉత్పత్తులకన్నా  రుచికరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమం ప్రజల చెంతకు చేర్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు,  వాట్సాప్, ఎస్.ఎమ్.ఎస్. లాంటి  సోషల్ మీడియా  ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్లడంలో  కృషి చేస్తున్నాయి.

మన్ కీ బాత్ కార్యక్రమం సేంద్రియ/సహజ వ్యవసాయాన్ని అవలంబించడంలో గణనీయమైన మార్పులను తీసుకురావడంలోను దోహదపడిందని, దానితో పాటుగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ వారిలో స్ఫూర్తిని నింపడం ద్వారా వినియోగ విధానంలో మార్పు తీసుకురావడం జరిగిందని అభిప్రాయపడ్డారు.  రైతులు వారు పండించిన సేంద్రీయ/సహజ వ్యవసాయ ఉత్పత్తులతో  సంతృప్తి చెందారు, 'మన్ కి బాత్' కార్యక్రమం వ్యవసాయదారులలో ఆసక్తి నెలకొల్పి, వ్యవసాయ సమాచారాన్ని పరస్పరం పంచుకొనేలా చేసి,  ప్రధాన  మోడీ  సందేశం ఎక్కువమందికి చేరేలా చేయడంలో సఫలీకృతం అయిందని చెప్పవచ్చు.  సరైన సమాచారం, సరైన వ్యక్తి తో కృష విజ్ఞాన కేంద్రాలు, అనుబంధ శాఖల సమన్వయ కృషితో,  ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా సేంద్రియ/సహజ వ్యవసాయాన్ని ప్రోత్సాహించడానికి ఈ ' మన్ కి బాత్ ' కార్యక్రమం ఉపయోగపడిందడంలో ఎలాంటి సందేహం లేదు.


సేంద్రియ/ జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య నిర్వహణ సంస్థ (మేనేజ్), 
రాజేంద్రనగర్, హైదరాబాద్