ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్

న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంబడి మన భూభా గాన్ని చైనా ఆక్రమించి, అందులో బ్రిడ్జి కడుతోంది.. ఆ బ్రిడ్జిని ప్రారంభించేం దుకు మన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తా రేమో అని భయపడుతున్నట్లు కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ విమర్శించారు. ఈ వంతెన నిర్మాణంపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని జనవరి 4న కూడా రాహుల్ ప్రశ్నించగా.. బుధవారం మరోసారి ట్వీట్ చేశారు. ‘‘మన దేశంలో చైనా చట్ట విరుద్ధంగా ఓ బ్రిడ్జిని కడుతోంది. ప్రధాని మౌనం వల్ల చైనా సైన్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగు తోంది. ఇప్పుడున్న భయం ఏంటంటే, ఈ వంతెనను ప్రారంభిం చేందుకు పీఎం వెళ్లరు కదా” అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. పాంగోంగ్ సరస్సుపై బ్రిడ్జి నిర్మాణం వల్ల చైనా దళాలు ఈజీగా ప్రయాణించగలుగు తాయి. 8 మీట ర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు మీడియా తెలిపింది. పాంగోంగ్ సరస్సు ఉత్తర తీరంలో, చైనా ఆర్మీ ఫీల్డ్‌‌కు దక్షిణ దిశలో ఈ వంతెన ఉన్నట్లు తెలిపింది.