త్రేతా యుగంలో ప్రజలు రాముడు 14 ఏళ్ళు ఎదురు చూస్తే.. అయోధ్య వాసులు 500 ఏళ్ల నుంచి ఈ సమయం కోసం ఎదురు చూశారని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో జరిగిన సభలో మోదీ తెలిపారు. జైశ్రీరామమూర్తి అంటూ ప్రారంభించిన మోదీ.. రామ్‌లల్లా ఇక టెంట్ లో ఉండరు.. గర్భగుడిలో ఉంటారన్నారు. అయోధ్యకు రాముడొచ్చాటంటూ... దేశంలో రామరాజ్యం వచ్చిందన్నారు. 2024 జనవరి 22 చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని... ఈ రోజు సామాన్యమైన రోజు కాదన్నారు. కాలచక్రంలో ఎప్పటికీ గుర్తుంచుకొనే సమయమన్నారు. వెయ్యేళ్ల తరువాత కూడా ఈ రోజును గుర్తుంచుకుంటారు..సరయూ నదికి... అయోధ్యపురికి నాప్రణామాలు.. రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు.
దేశ వ్యాప్తంగా ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. రామ జన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మించడానికి 500 సంవత్సరాలు ఎందుకు పట్టిందన్నారు. ఎన్నో ఏళ్లు.. పోరాటాలు.. బలిదానాల తరువాత అద్భతమైన ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని న్యాయ ప్రక్రియ ద్వారా నిర్మించామన్నారు. రాముడి ప్రతిష్ఠా కార్యక్రమంలో గర్భగుడిలో పాల్గొనడం తన అదృష్టమన్నారు.
రాముడు భారత దేశానికి ఆదర్శమన్నారు. రాముడు భారతదేశానికి ప్రతిష్ఠ.. రామ భక్తులందరికి నా ప్రణామాలు.. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ అందరి స్వప్నాన్ని సాకారం చేసింది. రామాలయం నిర్మాణంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి.. అయినా దేవాలయం నిర్మిచాం.. ఇక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.
11 రోజలు ఉపవాస దీక్షలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను దర్శించానన్నారు. అన్ని భాషల్లో రామాయణం విన్నా.. భాష ఏదైనా రాముడు అందరికి ఆదర్శం.. రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం.. రాముడే విశ్వం.. రాముడే అనంత మన్నారు.