ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భేటీ

ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు  ముయిజ్జు భేటీ
  • భారత్​లో 4 రోజులు మాల్దీవుల అధ్యక్షుడి పర్యటన

న్యూఢిల్లీ:  మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో ముయిజ్జు తన భార్య సాజిదా మొహమ్మద్ తో కలిసి ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రిసీవ్ చేసుకున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్ తో ముయిజ్జు భేటీ అయ్యారు. ‘‘సోమవారం ముయిజ్జు, ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. వీరి చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాం” అని జైశంకర్ ట్వీట్ చేశారు.

 పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ముయిజ్జు భేటీ కానున్నారని, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఇరుదేశాల ప్రయోజనాలపై చర్చించనున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై, బెంగళూరు సిటీల్లో జరిగే పలు కార్యక్రమాల్లో  కూడా ఆయన పాల్గొనున్నారని పేర్కొంది.