అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ ప్రిమైసెస్ లో ఉన్న ఐసెన్ హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ లో చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగా ఏర్పడిన రీసెంట్ డెవలప్మెంట్స్ పై చర్చించారు. భారత్-అమెరికా సంబంధాలు, టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అంతరిక్ష రంగంలో సహకారంపై ప్రధానంగా చర్చ జరిగింది. పాకిస్తాన్ లోనే ఉగ్రవాద గ్రూప్ లు పనిచేస్తున్నాయని... వాటిపై చర్చలు తీసుకోవాలని పాకిస్తాన్ కు సూచించారు కమలా హ్యారిస్.
కరోనా సెకండ్ వేవ్ లో సాయమందించిన అమెరికాకు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోడీ. భారత్-అమెరికాలు సహజ భాగస్వాములని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడం చారిత్రాత్మకమన్నారు. ప్రపంచంలో ఎందరికో కమలా హ్యారిస్ ఇన్సిపిరేషన్ అని చెప్పారు. కమల నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమలకు స్వాగతం పలికేందుకు భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
వాతావరణ అంశాన్ని భారత్ సీరియస్ గా తీసుకుందని తెలుసన్నారు కమలా హ్యారిస్. ఈ అంశంలో భారత్ అమెరికా కలసి పనిచేస్తే ప్రపంచంపైనే మంచి ప్రభావం చూపుతుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ఓపెన్ గా, స్వేచ్ఛగా ఉండేందుకు భారత్, అమెరికా కలసి పనిచేస్తున్నాయన్నారు. కరోనా సంక్షోభంలో భారత్ కు సాయం చేయడం గర్వంగా ఉందన్నారు. అలాగే వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచానికి భారత్ అతిపెద్ద సోర్స్ గా నిలిచిందన్నారు. అలాగే వ్యాక్సిన్ ఎగుమతులను మళ్లీ ప్రారంభిస్తామన్న భారత్ ప్రకటనను స్వాగతించారు.
see more news