పారిస్లో విందు.. ప్రధానిమోదీకి వెల్కమ్ డిన్నర్ ఇచ్చిన మాక్రాన్

పారిస్లో విందు.. ప్రధానిమోదీకి వెల్కమ్ డిన్నర్ ఇచ్చిన మాక్రాన్

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం (ఫిబ్రవరి 11)న పారీస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీని కౌగిలించుకుని వెల్ కమ్ టు ప్యారిస్ అంటూ స్వాగతం పలికారు. మరోవైపు పారిస్‌లో అడుగుపెట్టగానే  ప్రధాని మోదీకి అక్కడున్న భారతీయులు ఘన స్వాగతం పలికారు. 

‘‘నా మిత్రులు ప్రధాని మోదీకి పారిస్ స్వాగతం..’’ అని ఎలిస్ ప్యాలెస్ కు ప్రధాని మోదీ వచ్చిన వీడియోను మాక్రాన్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో షేర్ చేశారు.  

ALSO READ | ట్రంప్ టారిఫ్ వార్.. స్టీల్, అల్యూమినియంపై 25 శాతం

తర్వాత ఏఐ సమ్మిట్ కు ముందు పారీస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా్న్యుయేల్ ఏర్పాటు చేసిన స్వాగత విందుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.  విందుకు హాజరైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను ప్రధాని మోదీ  కలిశారు. ఇద్దరు నేతల మధ్య మొదటి సమావేశం ఇది. వెల్ కమ్ డిన్నర్ లో ముగ్గురు నేతలు మాట్లాడుకుం టున్న ఫొటోలను పీఎం కార్యాలయం (PMO) షేర్ చేసింది.