అమెరికా భద్రతా సలహాదారుని కలిసిన ప్రధాని మోదీ

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్  సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైయారు. భారత్- అమెరికా, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని X లో PM ట్వీట్ చేసారు.

 ముఖ్యంగా సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలికాం, డిఫెన్స్, క్రిటికల్ మినరల్స్, స్పేస్ మొదలైన వాటితో పాటు ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (iCET) కింద ద్వైపాక్షిక సహకారం యొక్క వివిధ రంగాలలో పురోగతిని సుల్లివన్ ప్రధానికి వివరించారు. రక్షణ రంగానికి చెందిన కొన్ని ఒప్పందాలపై కూడా చర్చలు జరిగాయి. విదేశాంగ మంత్రి జై శంకర్, ఇండియా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా జేక్ సుల్లివన్ తో భేటీ అయ్యారు.