తెలంగాణ బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవుల నుంచి కింద స్థాయి పదవుల వరకు అన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొడుకు, కూతురు, బంధువులకు అప్పగించి..తెలంగాణను అన్నీ విధాలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను లూఠీ చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్.. తన కుటుంబ సభ్యుల్ని ధనవంతుల్ని చేసుకోవడం తప్ప రాష్ట్రాభివృద్దిని గాలికి వదిలేశారని మోదీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయన్నారు. ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే అని మోదీ కొనియాడారు.
భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. రూ. 8వేల కోట్లకు పైగా పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ను ప్రారంభించామని...రామగుండంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో తెలంగాణాకే అధిక విద్యుత్ వాటా దక్కుతుందని చెప్పారు. తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తానే ప్రారంభించానని తెలిపారు. నిజామాబాద్ మహిళలు తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బయట మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతాం అంటూ ..లోపల కుట్రలు చేశారని విమర్శించారు. దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయగలిగానన్నారు.
ALSO READ: కేంద్ర నిధులను బీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తోంది : మోదీ
గతంలో తెలంగాణ నిజాం కబంధ హస్తాల్లో ఉండేదని... కానీ గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ..తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారని గుర్తు చేశారు. . మీకు స్వేచ్ఛను అందించారు. ఇప్పుడు మరో గుజరాతీ బిడ్డ తెలంగాణకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారని చెప్పారు. కుటుంబ వాదానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు మోదీ. ఇక్కడి కల్వకుంట్ల కుటుంబానికి దొరికింది దోచుకోవడమే విద్య అని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఎందరో మంది ప్రాణత్యాగం చేశారని... లక్షలాది కుటుంబాల ఆకాంక్షలను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసిందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను దోచుకున్న డబ్బు..కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇచ్చిందన్నారు.