తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే రామగుండంలో 800 మెగావాట్ల ఎన్టీపీసీని ప్రారంభించుకున్నామని చెప్పారు. త్వరలో టీటీపీపీ రెండో దశ కూడా ప్రారంభించుకుందామని తెలిపారు. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగించిన మోదీ.. బీజేపీ ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు..వాటిని పూర్తి కూడా చేస్తుందన్నారు. ఇది తమ వర్క్ కల్చర్ అంటూ చెప్పుకొచ్చారు.
ALSO READ: నిజామాబాద్లో ప్రధాని మోదీ చేసిన ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఇవే
త్వరలో భారతీయ రైల్వే వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తవుతుందన్నారు ప్రధాని మోదీ. దేశంలో వైద్యపరమైన సమస్యలు అధిగమించేందుకు 9 ఏండ్లుగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
బీబీనగర్ లో నిర్మిస్తున్న ఎయిమ్స్ నిర్మాణ పనులు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని గుర్తు చేశారు. అటు హాసన్ చర్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ ద్వారా ఖర్చు తగ్గుతుందని చెప్పారు.