థాయిలాండ్లో బిమ్స్టెక్ సదస్సు..పక్కపక్కనే ప్రధాని మోదీ,యూనస్

థాయిలాండ్లో బిమ్స్టెక్  సదస్సు..పక్కపక్కనే ప్రధాని మోదీ,యూనస్

6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం శుక్రవారం(ఏప్రిల్4) బ్యాంకాక్లో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కూటమి సభ్యులు, భారతదేశ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్ పాల్గొన్నాయి. 

మార్చి28న మయన్మార్, థాయిలాండ్ లో భూకంపం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలు భూకంపం వినాశనం సృష్టించాయి. ఈ సమయంలో బిమ్స్టెక్  సమావేశం జరుగుతోంది. భూకంపంలో ప్రాణాలు కోల్పోయి వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.ఈ సమావేశంలో వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి ప్రధానిమోదీ నిబద్ధతను నొక్కి చెప్పారు. 

ఈ సమావేశంలో ప్రధాని మోదీ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. భారతదేశ UPIని BIMSTEC దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించాలని సూచించారు.  UPIని అనుసంధానించడం వల్ల వాణిజ్యం, పర్యాటకం పెరుగుతుందని BIMSTEC సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు శుక్రవారం ఉదయం మయన్మార్ సీనియర్ జనరల్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధాని మోదీ సమావేశమై రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 

ALSO READ : ట్రంప్ ఎఫెక్ట్.. గ్రీన్​ కార్డున్నా.. హెచ్​1బీపై వెళ్లినా కఠినమే

ఈ సమావేశానికి ముందు థాయ్ ప్రధాని బిమ్స్టెక్ కూటమి దేశాల అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోదీ,బంగ్లాదేశ్ చీఫ్ ఎడ్వయిజర్ యూనస్ పక్కపక్కనే కూర్చొని కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను యూనస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టడంతో ఆసక్తికరంగా మారింది.