మధ్యప్రదేశ్ లోని మహాకాళ్ కారిడార్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. దాదాపు 856 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మోడీ. ఆ తర్వాత శ్రీ మహాకాళ్ లోక్ ని ప్రారంభించారు. ఆలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహాకాళ్ ఆలయానికి వెళ్లే దారిలో 600 మీటర్ల పొడవున్న హరి పతక్ వంతెనపై నూనె దీపాలను ఏర్పాటు చేశారు.
దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మహాకాలుడి ఆలయం ఒకటి. ఏడాది మొత్తం మహాకాలుడి దర్శనం చేసుకుంటారు భక్తులు. మధ్యప్రదేశ్ లోన ఉజ్జయినిలో మహాకాలుడి ఆలయం ఉంది. ఆలయాన్ని మరింత విస్తరించింది బీజేపీ ప్రభుత్వం. ఆలయం ప్రస్తుతం 2.87 హెక్టార్లు ఉండగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాతా ఆలయ విస్తీర్ణం 47 హెక్టార్లకు ఎక్స్ టెండ్ అవ్వనుంది.
మహాకాళ్ దారి పోడవున 108 స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇసుక స్తంభంపై త్రిశూలం, శివుడి ముద్రలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ ఆలయ పునరాభివృద్ధి కంటే మూడు రెట్లు ఎక్కువగా మహాకాళ్ కారిడార్ పునరాభివృద్ధి జరిగినట్లు అధికారులు తెలిపారు.