SLBC Tunnel: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

SLBC Tunnel:  సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

ప్రధాని మోదీ సీఎం రేవంత్ కు ఫోన్ చేశారు. శ్రీశైలం ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో  ప్రమాదంపై ఆరా దీశారు. సొరంగంలో  చిక్కుకున్న 8 మంది కోసం సహాయక చర్యలు చేపట్టామని రేవంత్ మోదీకి  చెప్పారు. ఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యవేక్షిస్తున్నారని మోదీకి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తామని మోదీ చెప్పారు. సహాయక చర్యలకు అవసరమైన అన్ని విధాల సాయం చేసేందుకు  కేంద్రం సిద్ధంగా ఉందని రేవంత్ కు హామీ ఇచ్చారు మోదీ. మరోవైపు ఎస్ ఎల్ బీసీ టన్నెల్  దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం గాలిస్తోంది. 

Also Read :- బెల్లంపల్లి ఎక్స్​ప్రెస్ ​రైళ్ల హాల్టింగ్​ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్త

 నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్  దగ్గర  ఫిబ్రవరి 22  ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే  మరో  ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది.