
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి క్రమంలో.. భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. హై అలర్ట్ ప్రకటించింది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. విషయం తెలిసిన వెంటనే తన కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని ఇండియా వచ్చారు. ప్రధాని మోదీ.. సౌదీ నుంచి ఇండియా వచ్చే మార్గాన్ని మార్చారు భద్రతా అధికారులు.
జమ్మూలోని బెసరన్ లో ఉగ్రవాదుల మారణహోమం తర్వాత.. పాకిస్తాన్ మళ్లీ ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలతో ప్రధాని మోదీ వస్తున్న విమానం రూట్ మార్చారు. సౌదీ నుంచి ఇండియాకు పాకిస్తాన్ గగనతనం నుంచి రావాల్సి ఉంటుంది. సౌదీ నుంచి మోదీ విమానం పాక్ గగనతలం నుంచి వస్తున్న విషయం మీడియాలోనూ రావటంతో.. పాకిస్తాన్ ఏమైనా ఎటాక్ చేసే అవకాశాలు లేకపోలేదు అనే అనుమానాలను భద్రతా బలగాలు హెచ్చరించాయి.
దీంతో మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని రూటు మార్చారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి కాకుండా ఒమెన్ మీదుగా ప్రయాణించి.. మోదీ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. పహల్గాం ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. NIA బృందాలను జమ్మూ పంపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గాంలో పర్యటిస్తూ.. పరిస్థితులను ఎప్పటికిప్పుడు ప్రధాని మోదీకి వివరిస్తున్నారు.
►ALSO READ | పెళ్లై ఏడు రోజులే..భార్యతో హానీమూన్ కు వచ్చి ..ఉగ్రదాడిలో బలైన నేవీ అధికారి విషాదగాధ
పెహల్గాంలో దాడికి ప్రతీకారంగా.. పాకిస్తాన్ కు.. ఉగ్రవాదులకు గట్టి బుద్ది చెప్పాలని యావత్ భారతదేశం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరిపారేయాలని నిర్ణయించింది.