రోహిత్‌‌‌‌‌‌‌‌ బృందానికి మోదీ ప్రశంసలు.. ప్రతీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌తో ఫొటోలు, ముచ్చట్లు

రోహిత్‌‌‌‌‌‌‌‌ బృందానికి మోదీ ప్రశంసలు..  ప్రతీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌తో ఫొటోలు, ముచ్చట్లు
  •     ముంబైలో పోటెత్తిన అభిమానులు
  •     నారిమన్‌‌‌‌‌‌‌‌ నుంచి వాంఖడే వరకు విక్టరీ పరేడ్‌‌‌‌‌‌‌‌
  •     రూ.125 కోట్ల నజరానా అందజేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న టీమిండియాకు అదిరిపోయే స్వాగతం లభించింది. ప్లేయర్లను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’లో ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో దిగింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ‘వాటర్‌‌‌‌‌‌‌‌ కెనాన్‌‌‌‌‌‌‌‌ సెల్యూట్‌‌‌‌‌‌‌‌ చేయగా, 16 గంటల నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌ జర్నీ తర్వాత మాతృభూమిపై అడుగుపెట్టిన ప్లేయర్లు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఉదయం 4.30 నుంచే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ బయట వేచి చూసిన వందలాది మంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ జయహో టీమిండియా అంటూ జయజయ ధ్వానాలతో హోరెత్తించారు. 

మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ  ఫ్లకార్డ్స్‌‌‌‌‌‌‌‌తో పాటు కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌, ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ ఫొటోలను చేతపట్టుకుని తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. వేలాది మంది పోలీసుల పహరా కాస్తుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య టీ3 టెర్మినల్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్లేయర్లను రెండు బస్సుల్లో ఐటీసీ మౌర్య షెరటాన్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. ఇక్కడ డోల్‌‌‌‌‌‌‌‌ వాయిద్యాల మధ్య బాంగ్రా నృత్యంతో  స్వాగతం పలికారు. రోహిత్‌‌‌‌‌‌‌‌, సూర్య, హార్దిక్‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ కాసేపు బాంగ్రా స్టెప్పులతో సందడి చేశారు. 

మోదీతో రెండు గంటలు..

హోటల్‌‌‌‌‌‌‌‌లో ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ అయిన తర్వాత టీమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రోజర్‌‌‌‌‌‌‌‌ బిన్నీ, సెక్రటరీ జై షా లోక్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు మోదీ, ప్లేయర్ల మధ్య ఆసక్తికర సంభాషణలు సాగాయి. మట్టి టేస్ట్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉందంటూ రోహిత్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించిన ప్రధాని లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఫెయిలైన కోహ్లీని ఫైనల్లో ఎలా ఆడావంటూ అడిగారు. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌, సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ గురించి ఆరా తీశారు. ప్లేయర్లతో కలిసి మోదీ బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ తర్వాత మోదీతో ప్రతి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ తమ ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌తో కలిసి వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. తర్వాత ‘నమో 1’ అని ఉన్న జెర్సీని బిన్నీ, జై షా.. ప్రధానికి బహూకరించారు. ఈ సందర్భంగా ‘మా చాంపియన్‌‌‌‌‌‌‌‌లతో అద్భుతమైన సమావేశం. 7 ఎల్‌‌‌‌‌‌‌‌కేమ్‌‌‌‌‌‌‌‌ వద్ద వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇచ్చాం. టోర్నీలో వాళ్ల అనుభవాలకు సంబంధించిన సంభాషణలు అద్భుతంగా సాగాయి’ అని మోదీ టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఉన్న ఫోటోను ఎక్స్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మరోవైపు ‘దేశ ప్రధాని మోదీని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. మమ్మల్ని మీ నివాసానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సర్‌‌‌‌‌‌‌‌’ అని కోహ్లీ తన ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

రోహిత్‌‌‌‌‌‌‌‌ను అలా ఎప్పుడూ చూడలేదు: కోహ్లీ

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ తర్వాత రోహిత్‌‌‌‌‌‌‌‌ చాలా భావోద్వేగానికి గురయ్యాడని కోహ్లీ వెల్లడించాడు. గతంలో ఎప్పుడూ హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ను అంత ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా చూడలేదన్నాడు. ‘ఉబ్బిన కళ్లతో రోహిత్‌‌‌‌‌‌‌‌ నన్ను కౌగిలించుకున్నాడు. 15 ఏళ్లలో మొదటిసారి అలాంటి భావోద్వేగాన్ని చూశా. విజయం తర్వాత స్టేడియం మెట్లు ఎక్కేటప్పుడు ఒకర్ని ఒకరం చూసుకుని ఏడ్చాం. 21 ఏళ్ల టీమిండియా భారాన్ని మోసిన సచిన్‌‌‌‌‌‌‌‌ను మేం భుజాలపై ఎత్తుకున్నాం. అలాంటి ట్రోఫీని మేం ఇక్కడికి తీసుకొచ్చి ఆ భారాన్ని మేం తగ్గించుకున్నాం. 

ఇక తర్వాతి తరం కూడా దీన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇక చిన్నప్పుడు చూసిన వాంఖడేకు ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా ఉందని బుమ్రా అన్నాడు. తన లైఫ్‌‌‌‌‌‌‌‌లో ఏదైతే చూడాలని కోరుకున్నానో అది జరిగిందన్నాడు. ఇక ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తో క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు విలన్‌‌‌‌‌‌‌‌గా మారిన హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా ఇప్పుడు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ హీరోగా ముంబైలో అడుగుపెట్టాడు.