సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ‘బప్పి లహిరి జీ సంగీతం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు.. విభిన్నమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తీకరించింది. తరతరాల ప్రజలు ఆయన సంగీతంతో సంబంధం కలిగి ఉంటారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
PM Modi expresses condolences on the demise of singer-composer Bappi Lahiri
— ANI (@ANI) February 16, 2022
"Shri Bappi Lahiri Ji’s music was all-encompassing, beautifully expressing diverse emotions. People across generations could relate to his works. Saddened by his demise," the PM tweets pic.twitter.com/2jICoWSP40
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
బప్పి లహిరి సాటిలేని గాయకుడు, స్వరకర్త అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బప్పీ మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘బప్పీ పాటలు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రజాదరణ పొందాయి. ఆయన పాటలలో యువతకు నచ్చేవాటితో పాటు మనోహరమైన మెలోడీలు కూడా ఉన్నాయి. ఆయన చిరస్మరణీయమైన పాటలు చాలా కాలం పాటు శ్రోతలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి’ అని కోవింద్ ట్వీట్ చేశారు.
Shri Bappi Lahiri was a matchless singer-composer. His songs found popularity not only in India but abroad. His diverse range included youthful as well as soulful melodies. His memorable songs will continue to delight listeners for long time. Condolences to his family and fans.
— President of India (@rashtrapatibhvn) February 16, 2022
మెగాస్టార్ చిరంజీవి
లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మరణం పట్ల తాను తీవ్ర వేదన చెందానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న గొప్ప అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు.
‘అతను నా కోసం అనేక చార్ట్‌బస్టర్‌లను అందించాడు. దాంతో నా చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆయన తన ప్రత్యేకమైన శైలి, సంగీతంలో ఆయనకున్న ఉత్సాహంతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. బప్పీ కుటుంబసభ్యులు, సన్నిహితులందరికీ నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022
నందమూరి బాలకృష్ణ
‘సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. నేను నటించిన రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ వంటి చిత్రాలకు బప్పి లహిరి సంగీతం అందించారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.
Natasimham #NandamuriBalakrishna expressed his deepest condolences over the sudden demise of Legendary Musician #BappiLahiri.#RipBappilahiri pic.twitter.com/vrOQ614hk8
— VamsiShekar (@UrsVamsiShekar) February 16, 2022
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
లెజెండరీ సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ బప్పి లహిరి అకాల మరణం గురించి తెలిసి షాక్ అయ్యాను. ఆయన మా బెంగాల్‌కు చెందిన వారు. బప్పీ తన ప్రతిభ మరియు కష్టపడేతత్వం ద్వారా భారత కీర్తిని మరింత పెంచారు. తన సంగీతంతో మమ్మల్ని గర్వించేలా చేశాడు. మేం ఆయనకు మా అత్యున్నత రాష్ట్ర పౌర పురస్కారం ‘బంగాబిభూషణ్’ ప్రదానం చేశాం. ఆ మేధావిని మేం ఎల్లప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాము. బప్పి మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
Shocked to hear about the untimely demise of legendary singer and music composer Bappi Lahiri. A boy from our North Bengal, he rose to all-India fame and success by the dint of his sheer talent and hard work, and made us proud by his musical contributions. (1/2)
— Mamata Banerjee (@MamataOfficial) February 16, 2022
హోంమంత్రి అమిత్ షా
లెజెండరీ సింగర్, కంపోజర్ బప్పి లహిరి జీ మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచంలో పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. బప్పి దా తన గానంతో సజీవంగా గుర్తుండిపోతాడు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
Pained to learn about the passing away of legendary singer and composer, Bappi Lahiri Ji. His demise leaves a big void in the world of Indian music. Bappi Da will be remembered for his versatile singing and lively nature. My condolences to his family and admirers. Om Shanti.
— Amit Shah (@AmitShah) February 16, 2022
యువరాజ్ సింగ్
బప్పి లహిరి మృతిపట్ల మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘పురాణ సంగీత విధ్వాంసుడు బప్పిలహిరి జీ మరణం విచారకరమైన వార్త. అన్ని వయసుల వారిని మంత్రముగ్ధులను చేసే ఆయన సంగీతాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని యువీ ట్వీట్ చేశారు.
Sad news of the passing away of legendary musician #BappiLahiri ji ?? he will be fondly remembered for his mesmerising musical compositions which are loved by people of all ages. My condolences to the family. RIP #BappiDa ॐ शान्ति ??
— Yuvraj Singh (@YUVSTRONG12) February 16, 2022