విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ

విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం వైఎస్ జగన్ ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని INSచోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్‌ హౌస్‌)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. విశాఖలో రేపు 10,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పూర్తయిన  మరో రెండు  ప్రాజెక్టులను  జాతికి అంకితం చేయనున్నారు. 

అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో  ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ  పాల్గొంటారు. ఈ సభలో 40 నిమిషాల పాటు ప్రధాని  ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం  12 గంటలకు ప్రధాని మోడీ  వైజాగ్ ఎయిర్ పోర్టు  నుంచి  హైదరాబాద్ కు  బయలుదేరతారు. రేపు ప్రధాని మోడీ పాల్గొనే  బహిరంగ సభ  ఏర్పాట్లను నేతలు పరిశీలించారు.