ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 17వ తేదీన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన కె. పళనివేల్ అనే మత్స్యకారుడు ఈ వేడుకకు హాజరయ్యాడు. విశ్వకర్మ యోజన చెక్కును అందుకోవడానికి పళనివేల్కు పిలుపొచ్చింది. దీంతో పళనివేల్ వేదికపైకి వస్తున్న క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పళనివేల్ ప్రధాని మోదీ దగ్గరకు రాగానే ఆయనకు నమస్కారం చేశారు. అనంతరం మోదీని హత్తుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Beautiful moment during the launch of PM #Vishwakarma Yojana at newly inaugurated world class #Yashobhoomi Convention Centre at Delhi. pic.twitter.com/8SIT75pfZr
— Kiren Rijiju (@KirenRijiju) September 17, 2023
పీఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించిన మోదీ..ఈ పథకంలో మత్స్యకారులు, కార్మికులు, సూత్రధార్, కుమ్మరులు సహా చేతివృత్తుల వారు ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 13,000 కోట్లను కేటాయించింది. బయోమెట్రిక్, గుర్తింపు కార్డు ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికి ఫోటో ఐడీలు, సర్టిఫికెట్లు, శిక్షణ ఇస్తారు.
విశ్వకర్మ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షల వరకు లోన్ ఇస్తుంది. మొదట రూ. 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీసుకున్న లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత విశ్వ కర్మ భాగస్వాములకు అదనంగా రూ.2లక్షల లోన్ అందజేస్తారు.
Also Read : మగాళ్లకు ఏ మాత్రం తగ్గేదేలా.. రన్నింగ్ లోనే రైలు ఎక్కేస్తున్నారు లేడీస్
ఎలా అప్లయ్ చేయాలి
- ఈ పథకం కింద లబ్ధిదారులు బయోమెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్ ను ఉపయోగించి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
- ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతివృత్తుల వారికి వర్తిస్తుంది.
- మొదట 18 సాంప్రదాయ చేతివృత్తిదారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. వీరిలో వడ్రంగి(సుతార్), పదవ తయారీదారు, కవచం, కమ్మరి, సుత్తి, టూల్ కిట్ మేకర్, తాళాలు తయారు చేసేవాడు, స్వర్ణకారుడు, కుమ్మరి, శిల్పి, రాతిని విరిచేవాడు, చెప్పులు కుట్టేవాడు, తాపీపని, బుట్ట, చాప, చీపు మేకర్, బొమ్మల తయారీదారులు, ఫిషంగ్ నెట్ మేకర్, మంగలి, దండలుచేసేవాడు, టైలర్, చాకలి వంటి చేతివృత్తిదారులు ఈస్కీం కు అర్హులు.
- మొదటి ఏడాది ఐదు లక్షల కుటుంబాలకు బీమా, ఫైనాన్షియల్ ఇర్ 2023 నుంచి 28 వరకు ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు బీమా వర్తిస్తుంది.
- హస్తకళాకారులు, హస్తకళాకారుల ఉత్పత్తులు, సేవల నాణ్యతను మెరుగుపరచడం , వారు దేశీయ , గ్లోబల్ వాల్యూ చైన్‌లతో అనుసంధానించబడి ఉండేలా చూడడం ఈ పథకం ప్రధాన దృష్టి.
- లబ్ధిదారులకు PM విశ్వకర్మ సర్టిఫికేట్, ID కార్డ్ ఇస్తారు. ప్రాథమిక, అధునాతన శిక్షణతో కూడిన నైపుణ్యం అప్‌గ్రేడేషన్ అందించబడుతుంది.
- ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు ₹ 15,000 టూల్‌కిట్ ప్రోత్సాహకం, ₹ 1 లక్ష వరకు (మొదటి విడత), ₹ 2 లక్షలు (రెండో విడత) రాయితీ వడ్డీ రేటుతో ₹ 15,000, ప్రోత్సాహకం అందించబడుతుంది.